Chandrababu: కోర్టు హాలులో చంద్రబాబు, సీఐడీ న్యాయవాదుల మధ్య మాటల యుద్ధం.. బెంచ్ దిగి వెళ్లిపోయిన జడ్జి

  • కాల్ డేటా రికార్డులపై నేడు ఏసీబీ కోర్టులో విచారణ
  • చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన దమ్మాలపాటి శ్రీనివాస్
  • సీఐడీ తరఫున వాదనలు వినిపించిన వివేకానంద
  • ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య తీవ్ర వాగ్వాదం
Chandrababu and CID lawyers in ACB court hall

ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు న్యాయవాదులు, సీఐడీ న్యాయవాదుల మధ్య గురువారం తీవ్రవాగ్వాదం తలెత్తింది. కాల్ డేటా రికార్డులపై విచారణ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాదన పెరిగి ఉద్రిక్తత తలెత్తింది. దీంతో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్నవారు మినహా అందరూ హాలు నుంచి వెళ్లిపోవాలని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. న్యాయవాదుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇలా చేస్తే విచారణ కష్టమని బెంచ్ దిగి వెళ్లిపోయారు.

సీఐడీ అధికారుల కాల్ డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ దాఖలు చేశాయి. ఈ రోజు ఏసీబీ కోర్టులో ఈ పిటిషన్‌పై విచారణ జరిగింది. పిటిషన్ వేసి నెల రోజులైందని, త్వరగా విచారించాలని చంద్రబాబు తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ అన్నారు. అసలు ఈ పిటిషన్ అనర్హమైనదని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద వాదించారు. ఈ క్రమంలో ఇరువైపుల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో వారిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News