Nara Lokesh: చంద్రబాబు, పవన్ పై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టమవుతోంది: లోకేశ్

Lokesh slams CM Jagan agains
  • సీఎం జగన్ పై లోకేశ్ విమర్శనాస్త్రాలు
  • నాలుగున్నరేళ్లుగా సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదని విమర్శ  
  • జగన్ కు అధికార మదం ఎక్కిందని వ్యాఖ్యలు 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సీఎం జగన్ పై విమర్శల పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇవాళ కూడా ఎక్స్ వేదికగా సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం, దాచుకోవడం, దాడులు చేయడం తప్పించి చేసిన అభివృద్ధి శూన్యం అని పేర్కొన్నారు. సీఎంగా చేసిన మంచి పని ఒక్కటీ లేదని తెలిపారు. అసలే సైకో అయిన జగన్ కు అధికార మదం ఎక్కిందని, ఫ్రస్ట్రేషన్ పీక్స్ కి చేరి పిచ్చిగా వాగుతున్నాడని వివరించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై జగన్ ప్రేలాపనలు చూస్తుంటే పిచ్చి ముదిరిందని స్పష్టమవుతోందని వ్యంగ్యం ప్రదర్శించారు. 

లోటు బడ్జెట్  తో ఏర్పడిన నవ్యాంధ్రను ఏ లోటూ లేకుండా అభివృద్ధి, సంక్షేమంలో పరుగులు పెట్టించినందుకు చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారా? అంటూ లోకేశ్ మండిపడ్డారు. పిచ్చి జగన్ వ్యవస్థలను మేనేజ్ చేసి 73 ఏళ్ల చంద్రబాబును నెల రోజులుగా జ్యుడిషియల్ రిమాండ్ లో ఉంచారని ఆరోపించారు.
Nara Lokesh
Chandrababu
Jagan
TDP
YSRCP
Andhra Pradesh

More Telugu News