Nara Lokesh: లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను డిస్పోజ్ చేసిన ఏపీ హైకోర్టు

AP High Court disposes Nara Lokesh anticipatory bail petition in skill development case
  • స్కిల్ కేసులో నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్
  • ఈ కేసులో లోకేశ్ ను నిందితుడిగా చూపలేదన్న సీఐడీ
  • లోకేశ్ ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు తెలిపిన వైనం
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ యువనేత నారా లోకేశ్ పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్పోజ్ చేసింది. ఈ కేసులో లోకేశ్ ను నిందితుడిగా చూపలేదని... అందువల్ల ఆయనను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తెలిపింది. ఒకవేళ కేసులో లోకేశ్ పేరును చేర్చితే... అప్పుడు 41ఏ కింద నోటీసులు ఇచ్చి విచారిస్తామని చెప్పింది. అరెస్ట్ చేయబోమని సీఐడీ స్పష్టం చేయడంతో ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
Nara Lokesh
YSRCP
Skill Development Case
Bail

More Telugu News