Ashwini Vaishnaw: వందే సాధారణ్ రైలు ఇదే.. ఫొటో షేర్ చేసిన కేంద్ర మంత్రి

  • సిద్ధమవుతున్న నాన్ ఏసీ వందే భారత్ రైలు
  • చెన్నై ఫ్యాక్టరీలో తయారీ.. ఇంజన్ ఫొటో ట్వీట్ చేసిన అశ్విని వైష్ణవ్
  • డిసెంబర్ నెలాఖరులోగా అందుబాటులోకి రానున్న ట్రైన్
Union Minister Ashwini Vaishnaw Shares First Look Of Push Pull Vande Sadharan Loco

దేశంలోనే సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సామాన్యుల కోసం వందే సాధారణ్ పేరుతో నాన్ ఏసీ రైళ్లను ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపింది. ఈ రైలుకు సంబంధించిన వివరాలను గతంలోనే వెల్లడించిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా వందే సాధారణ్ రైలుకు సంబంధించిన ఫొటోను ట్వీట్ చేశారు. వందే సాధారణ్ ట్రైన్ ను నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ రైలుకు ముందు, వెనుక ఇంజన్లు ఉంటాయని, రైలు ఎక్కడి నుండైనా వేగంగా దూసుకుపోతుందని రైల్వే మంత్రి చెప్పారు.

ఈ వందే సాధారణ్ రైలు ఫస్ట్ లుక్ ఫొటోను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ట్వీట్ చేశారు. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇది తయారవుతోంది. 22 కోచ్ లు, రెండు వైపులా లోకోమోటివ్ ఇంజన్లతో రైలు సిద్ధమైంది. ఈ ట్రైన్ లో 12 స్లీపర్ కోచ్ లు, 8 జనరల్ కోచ్ లు, 2 గార్డ్ కోచ్ లు ఉన్నాయని రైల్వే శాఖ వర్గాలు తెలిపాయి. ఈ నెలాఖరులో ట్రాయల్ రన్ ప్రారంభించి, డిసెంబర్ నెలాఖరులోగా ఈ రైలును అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

More Telugu News