వైసీపీ క్యాడర్ కు సీఎం జగన్ ఇచ్చిన సందేశం ఇదే: విజయసాయిరెడ్డి

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రంలోని అన్ని పార్టీలు దృష్టి సారించాయి. కేడర్ లో ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఎన్నికల దిశగా అడుగులు వేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కూడా ఇటీవల వైసీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎక్స్ వేదికగా స్పందిస్తూ... పార్టీ కేడర్ కు జగన్ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారని తెలిపారు. ప్రజల్లోకి వెళ్లాలని, ఏపీ ప్రయోజనాల కోసం ప్రజల్లో భరోసా కల్పిస్తూ వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పనులను వారికి వివరించాలని జగన్ చెప్పారని తెలిపారు. ప్రజల కోసం ఉన్న పార్టీ వైసీపీ అని చెప్పారు. వైనాట్ 175 అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశారు.


More Telugu News