Nara Lokesh: రెండ్రోజుల సీఐడీ విచారణ అనంతరం ఢిల్లీకి లోకేశ్

Nara Lokesh to reach delhi tonight
  • నేడు విచారణ అనంతరం ఢిల్లీకి పయనం
  • ఎల్లుండి చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ
  • న్యాయవాదులతో సమీక్ష కోసం ఢిల్లీకి బయలుదేరిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఢిల్లీకి బయలుదేరారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏపీ సీఐడీ ఆయనను రెండు రోజుల పాటు... నిన్న, ఈరోజు విచారించిన విషయం తెలిసిందే. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో విచారించింది. సీఐడీ విచారణ కోసమే లోకేశ్ మొన్న రాత్రి ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకున్నారు. నిన్న విచారణ అనంతరం సీఐడీ ఈ రోజు హాజరు కావాలని మరోసారి నోటీసులు ఇవ్వడంతో ఉండిపోయారు. నేడు విచారణ అనంతరం నేరుగా ఢిల్లీ బయలుదేరారు. శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై విచారణ ఉంది. దీనికి సంబంధించి న్యాయవాదులతో సమీక్షించేందుకు లోకేశ్ ఢిల్లీకి పయనమయ్యారు.
Nara Lokesh
New Delhi
Telugudesam

More Telugu News