YS Sharmila: తెలంగాణ ఎన్నికల బరిలో షర్మిల, విజయమ్మ.. రెండు స్థానాల నుంచి షర్మిల పోటీ?

YS Sharmila to contest from two seats in telangana
  • పాలేరు, మిర్యాలగూడ నుంచి షర్మిల పోటీ చేసే అవకాశం
  • సికింద్రాబాద్ నుంచి విజయమ్మ బరిలోకి దిగే అవకాశం
  • ఇప్పటికే పలువురు అభ్యర్థులను ఖరారు చేసిన పార్టీ అధ్యక్షురాలు
కాంగ్రెస్‌తో పొత్తు కుదరకపోవడంతో తెలంగాణలో బలం ఉన్న నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేయాలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇందులో భాగంగా షర్మిల స్వయంగా రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగాలని యోచిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆమె పాలేరు, మిర్యాలగూడ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అలాగే తల్లి వైఎస్ విజయమ్మ కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చునని వార్తలు వస్తున్నాయి. ఆమె సికింద్రాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

ప్రస్తుతం నియోజక వర్గాలవారీగా పలువురు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. సూర్యాపేట నుంచి పిట్ట రాంరెడ్డి, సత్తుపల్లి గుడిపల్లి నుంచి కవిత, బోధన్ నుంచి సత్యవతి, కల్వకుర్తి నుంచి అర్జున్ రెడ్డి, వనపర్తి నుంచి వెంకటేశ్వర రెడ్డి, నర్సంపేట నుంచి శాంతికుమార్, అదిలాబాద్ నుంచి బెజ్జంకి అనిల్, చేవెళ్ల నుంచి దయానంద్, గజ్వేల్ నుంచి రామలింగారెడ్డి, సిద్దిపేట నుంచి నర్సింహారెడ్డి, సిరిసిల్ల నుంచి చొక్కాల రాము, కామారెడ్డి నుంచి నీలం రమేశ్, అంబర్ పేట నుంచి గట్టు రామచంద్రరావులు బరిలో ఉంటారని తెలుస్తోంది.
YS Sharmila
Telangana
YS Vijayamma
Telangana Assembly Election

More Telugu News