Mallu Bhatti Vikramarka: దోపిడీ పాలకులను తెలంగాణ నుంచి తరిమికొట్టాలి: మల్లు భట్టి

Mallu Bhatti says brs and mim helping bjp
  • బీఆర్ఎస్‌కు ఓటేస్తే బీజేపీకి వేసినట్లేనన్న మల్లు భట్టి
  • బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ ఉందనీ, వీరికి మజ్లిస్ సహకరిస్తోందని ఆరోపణ
  • అందరూ ఓటేసి దోపిడీదారులకు బుద్ధి చెప్పాలని పిలుపు
బీఆర్ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లేనని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. బుధవారం ఆయన ఖమ్మంలో మీడియాతో మాట్లాడుతూ... బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ పని చేస్తోందని ఆరోపించారు. వీరికి మజ్లిస్ పార్టీ కూడా సహకరిస్తోందన్నారు. ఓ వైపు ప్రభుత్వ ఆస్తులను కేంద్రంలోని బీజేపీ అమ్ముకుంటుంటే, తెలంగాణలోని భూములను కేసీఆర్ అమ్మి సొమ్ములు చేసుకుంటున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది దోపిడీదారులు, దొరల చేతుల్లో పెట్టేందుకు కాదన్నారు. దోపిడీ పాలకులను తెలంగాణ నుండి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో అందరూ ఓటు హక్కును వినియోగించుకొని దోపిడీదారులకు బుద్ధి చెప్పాలన్నారు.
Mallu Bhatti Vikramarka
Congress
BJP
BRS

More Telugu News