Vaishnav Tej: 'ఆదికేశవ' నుంచి యూత్ ను హుషారెత్తించే బీట్!

  • 'ఆదికేశవ'గా వైష్ణవ్ తేజ్ 
  • ఆయన జోడీకట్టిన శ్రీలీల
  • సంగీతాన్ని అందించిన జీవీ ప్రకాశ్ కుమార్ 
  • నవంబర్ 10వ తేదీన సినిమా విడుదల
Adi Keshava Movie Lyrical Song Released

వైష్ణవ్ తేజ్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి 'ఆదికేశవ' సినిమాను రూపొందించాడు. నాగవంశీ - సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. మొదటిసారిగా పవర్ఫుల్ టైటిల్ తో .. పవర్ఫుల్ పాత్రలో వైష్ణవ్ తేజ్ ఈ సినిమా చేశాడు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాల్లో యాక్షన్ పాళ్లు ఎక్కువగా ఉన్నది ఇదే. 

తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'హే బుజ్జి బంగారం ప్రేమేగా ఇదంతా .. హే నువ్వు నా సొంతం నచ్చావే మరింతా' అంటూ ఈ పాట సాగుతోంది.  జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, అర్మాన్ మాలిక్ - యామిని ఘంటసాల ఆలపించారు. విదేశాల్లో చిత్రీకరించిన ఈ పాట బీట్ బాగుంది. 

మైనింగ్ కి అడ్డుగా ఉందనే ఉద్దేశంతో శివాలయాన్ని కూల్చడానికి విలన్ ప్రయత్నించడం .. అందుకు హీరో అడ్డుపడటమనే అంశం చుట్టూ అల్లుకున్న కథ ఇది. వైష్ణవ్ తేజ్ జోడీగా ఈ సినిమాలో శ్రీలీల కనిపించనుంది. జోజు జార్జ్  .. అపర్ణ దాస్ .. రాధిక ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, నవంబర్ 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News