Judges: ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురిని సిఫారసు చేసిన కొలీజియం

  • ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి న్యాయమూర్తుల బదిలీ
  • ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు
  • సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు 
Supreme Court Collegium recommends four advocates as AP High Court judges

ఏపీ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు రాబోతున్నారు. సీజేఐ చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం ఏపీ హైకోర్టు జడ్జిలుగా నలుగురు న్యాయవాదులను  సిఫారసు చేసింది. హరినాథ్ నూనెపల్లి, కిరణ్మయి మండవ, సుమతి జగడం, న్యాపతి విజయ్ లను హైకోర్టు జడ్జిలుగా కొలీజియం సిఫారసు చేసింది. త్వరలోనే ఈ నలుగురు న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇటీవల ఏపీ హైకోర్టు నుంచి పలువురు న్యాయమూర్తులు బదిలీపై వెళ్లడం తెలిసిందే.

ఈ నలుగురు గతంలో న్యాయవాదులుగా వ్యవహరించారు. వీరిని జడ్జిలుగా నియమించాలని ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్, ఇద్దరు సీనియర్ జడ్జిలు సంప్రదింపులు జరిపి, ఆ మేరకు ప్రతిపాదనలు పంపారు. ఆ నలుగురి అర్హతలు గుర్తించిన సుప్రీంకోర్టు వారిని న్యాయమూర్తులుగా నియమించవచ్చంటూ తాజాగా సిఫారసు చేసింది.

More Telugu News