KCR: ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించబోతున్న కేసీఆర్.. సెంటిమెంట్ ప్రకారం అక్కడి నుంచే ప్రచారం ప్రారంభం!

  • ఈ నెల 15న హుస్నాబాద్ నుంచి కేసీఆర్ ఎన్నికల ప్రచారం
  • మొత్తం 41 బహిరంగసభల్లో పాల్గొననున్న కేసీఆర్
  • ఈ నెల 15న అభ్యర్థులకు బీఫారాలు అందించనున్న బీఆర్ఎస్ అధినేత
KCR to start election campaigning from Oct 15

తెలంగాణ అసంబ్లీకి ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 30న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు దూకుడు పెంచుతున్నాయి. ఇప్పటికే ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్... ఇక గేర్ మార్చబోతున్నారు. ఇప్పటికే కేటీఆర్, హరీశ్ రావులు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ప్రచార రంగంలోకి దిగబోతున్నారు. ఈ నెల 15 నుంచి నవంబర్ 9 వరకు ఏకంగా 41 బహిరంగసభల్లో ఆయన పాల్గొనబోతున్నారు. నామినేషన్లు ప్రారంభమయ్యే నవంబర్ 3వ తేదీ లోపలే కేసీఆర్ 26 బహిరంగసభల్లో పాల్గొననున్నారు. ఈ నెల 15న అభ్యర్థులకు కేసీఆర్ బీఫారాలను అందజేయనున్నారు. 


మరోవైపు సెంటిమెంట్ ప్రకారం ఈసారి కూడా హుస్నాబాద్ నుంచే కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించబోతున్నారు. 2014, 2018 ఎన్నికల్లో కూడా ఆయన హుస్నాబాద్ నుంచే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పుడు కూడా అదే ఆనవాయతీని కొనసాగిస్తూ తొలి సభను అక్కడే నిర్వహించనున్నారు. 

కేసీఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్:
  • అక్టోబర్ 15: హుస్నాబాద్
  • అక్టోబర్ 16: జనగాం, భువనగిరి
  • అక్టోబర్ 17: సిద్దిపేట, సిరిసిల్ల
  • అక్టోబర్ 18: జడ్చర్ల, మేడ్చల్
  • అక్టోబర్ 26: అచ్చంపేట్, నాగర్ కర్నూల్, మునుగోడు
  • అక్టోబర్ 27: పాలేరు, స్టేషన్ ఘన్‌ పూర్
  • అక్టోబర్ 29: కోదాడ, తుంగతుర్తి, ఆలేరు
  • అక్టోబర్ 30: జుక్కల్, బాన్సువాడ, నారాయణఖేడ్
  • అక్టోబర్ 31: హుజూర్‌ నగర్, మిర్యాలగూడ, దేవరకొండ
  • నవంబర్ 1: సత్తుపల్లి  యెల్లందు
  • నవంబర్ 2: నిర్మల్, బాల్కొండ, ధర్మపురి
  • నవంబర్ 3: భైంసా (ముధోల్), ఆర్మూర్ , కోరుట్ల
  • నవంబర్ 5: కొత్తగూడెం, ఖమ్మం
  • నవంబర్ 6: గద్వాల్, మక్తల్, నారాయణపేట
  • నవంబర్ 7: చెన్నూరు, మంథని, పెద్దపల్లి
  • నవంబర్ 8: సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి
  • నవంబర్ 9: గజ్వేల్, కామారెడ్డి

More Telugu News