Rashmika Mandanna: ఆకాశంలో రష్మిక, రణబీర్ కపూర్ లిప్ లాక్.. వైరల్ అవుతున్న పోస్టర్

Rashmika Mandanna and Ranbir Kapoor liplock in Animal movie
  • రణబీర్ కపూర్, రష్మిక జంటగా 'యానిమల్'
  • ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతున్న చిత్రం
  • రేపు ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయనున్న యూనిట్
బాలీవుడ్ లో రష్మిక క్రేజ్ మామూలుగా లేదు. 'పుష్ప' సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను దగ్గరైన రష్మిక.. బాలీవుడ్ లో సెటిల్ అవ్వడంపై ఫుల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ లో ఆఫర్లు కూడా బాగానే ఉన్నాయి. మరోవైపు బాలీవుడ్ కు తగ్గట్టుగానే రష్మిక అన్నిటికీ ఓకే చెపుతోంది. రొమాంటిక్ సీన్లలో నటించేందుకు వెనుకాడటం లేదు. 

బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ తో రష్మిక కలిసి నటించిన 'యానిమల్' పోస్టర్ ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం విడుదల చేసింది. ఆకాశంలో విమానంలో ప్రయాణిస్తున్న సమయంలో రష్మిక, రణబీర్ కపూర్ ల అధరచుంబన సన్నివేశాన్ని పోస్టర్ గా వదిలారు. సోషల్ మీడియాలో ఈ పోస్టర్ వైరల్ అవుతోంది. రేపు ఈ చిత్రానికి చెందిన ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టు యూనిట్ ప్రకటించింది. 

ఈ చిత్రానికి 'అర్జున్ రెడ్డి' దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించాడు. డిసెంబర్ 1న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. హిందీ, తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది. 
Rashmika Mandanna
Ranbir Kapoor
Liplock
Animal Movie
Bollywood
Tollywood

More Telugu News