Indian govt: మొబైల్ ఫోన్లకు మరోసారి విపత్తు సందేశాలు.. ఏమైంది?

  • టెలికం శాఖ ద్వారా మొబైల్ యూజర్లకు అలర్ట్ లు
  • పరీక్షల్లో భాగంగానే పంపించినట్టు స్పష్టీకరణ
  • యూజర్ల వైపు నుంచి ఎలాంటి చర్యలు అవసరం లేదని వెల్లడి
Indian govt just sent another emergency alert making millions of phones sound alarm here is what it means

దేశవ్యాప్తంగా మంగళవారం మొబైల్ ఫోన్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రమత్త సందేశాలు వచ్చాయి. ఉదయం 11 గంటల తర్వాత నుంచి ఈ సందేశాలు రావడం మొదలైంది. మొబైల్ స్క్రీన్ పై ఫ్లాష్ సందేశాలు కనిపిస్తున్నాయి. అత్యవసర సందేశం వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ ప్రత్యేకంగా రింగ్ అవుతోంది. అయితే, విపత్తుల సమయంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు వీలుగా కేంద్ర సర్కారే వీటిని పంపిస్తోంది. 


విపత్తు, అత్యవసర సమయాల్లో దేశవ్యాప్తంగా ప్రజలను అప్రమత్తులను చేసేందుకు కేంద్ర సర్కారు ఓ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది. అది ఎంత సమర్థవంతంగా పనిచేస్తోందన్నది తెలుసుకునేందుకు వీలుగా ఈ సందేశాలు పంపిస్తున్నట్టు తెలిసింది. కొన్ని రోజుల క్రితం కూడా ఇదే విధంగా మొదటిసారి దేశవాసులకు అత్యవసర సందేశాలు వచ్చాయి. మంగళవారం అందరికీ కాకుండా, కొంత మందికే శాంపిల్ గా సందేశాలు పంపించారు. పెద్ద బీప్ సౌండ్ తో మొబైల్ స్క్రీన్ ఆన్ అయి, సందేశం కనిపిస్తుంది. చదివిన తర్వాత ఓకే బటన్ ప్రెస్ చేస్తే అది ఆగిపోతుంది. 

ఉదయం 11.30 గంటల నుంచి 11.44 గంటల మధ్య అత్యవసర సందేశాలు పంపినట్టు జాతీయ విపత్తు నిర్వహణ విభాగం తెలిపింది. ‘‘టెలికం శాఖ సెల్ బ్రాడ్ కాస్టింగ్ సిస్టమ్ ద్వారా పంపిస్తున్న శాంపిల్ మెస్సేజ్ ఇది. దీన్ని పట్టించుకోకండి. మీ వైపు నుంచి ఎలాంటి చర్యలు అవసరం లేదు’’ అన్న సందేశం అందులో ఉంది.

More Telugu News