Maruthi: నా సినిమాలు కొన్ని పోవడానికి కారణం ఇదే: డైరెక్టర్ మారుతి

  • దర్శకుడిగా మారుతి చాలా బిజీ
  • సొంత బ్యానర్ ఇబ్బంది పెట్టిందని వెల్లడి
  • అలాంటి సినిమాలు సక్సెస్ అయ్యాయని వివరణ 
  • ఆ సినిమా వలన నష్టపోలేదని వ్యాఖ్య      
Maruthi Special

మారుతి సినిమా అనగానే అందులో వినోదభరితమైన అంశాలు ఎక్కువగా ఉంటాయనే సంగతి ఆడియన్స్ కి తెలుసు. ఆయన సినిమాలలో కొన్ని హిట్ అయినవి ఉంటే మరికొన్ని ఫ్లాప్ అయినవి ఉన్నాయి. తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మారుతి మాట్లాడుతూ, తనకి ఫ్లాపులు పడటానికి గల కారణం గురించి ప్రస్తావించాడు. 

"నా దగ్గరున్న కథలను హీరోలు వినేసి తమకి ఏది సెట్ అవుతుందని ఎంచుకున్నారో ఆ సినిమాలు హిట్ అయ్యాయి. అలా కాకుండా నాపై నమ్మకంతో హీరోలు నాపైనే వదిలేసినప్పుడు, నేను వాళ్ల కోసం కథలు అల్లుకున్నాను. అలాంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి" అని అన్నాడు. 'ప్రతిరోజూ పండగే' .. 'ప్రేమకథా చిత్రమ్' .. 'భలే భలే మగాడివోయ్' కథలను హీరోలు ఎంచుకోవడం వలన విజయాలను అందుకున్నాయి" అని చెప్పాడు.

"ఇక 'మారుతి టాకీస్'ను మొదలుపెట్టి కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. ఆ బ్యానర్ లో కొన్ని సినిమాలు వదలడం వలన అలా జరిగింది. అందువల్లనే ఇక ఆ బ్యానర్ అలా పక్కన పెట్టడం జరిగింది. 'మంచి రోజులు వచ్చాయి' ఫ్లాప్ అయిందని అంటున్నారు. ఆ సినిమాను ఫాస్ట్ ఫుడ్ మాదిరిగా రెడీ చేయడం జరిగింది. నిజానికి ఆ సినిమా వలన ఎవరూ నష్టపోలేదు" అని అన్నాడు. 

More Telugu News