Priyamani: అష్టాదశ శక్తిపీఠాల చుట్టూ తిరిగే వెబ్ సిరీస్ .. దసరా స్పెషల్ గా 'ఆహా'లో!

Sarvam Shakthimayam
  • 'ఆహా'లో దసరా కానుకగా 'సర్వం శక్తిమయం'
  • భక్తిరస ప్రధానమైన వెబ్ సిరీస్ ఇది 
  • 18 శక్తి పీఠాల చుట్టూ తిరిగే కథ
  • 10 ఎపిసోడ్స్ గా నడిచే సిరీస్  
  • ఈ నెల 20వ తేదీ నుంచి స్ట్రీమింగ్
'ఆహా' ఎప్పటికప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైకి కొత్త కంటెంట్ ను తీసుకుని రావడానికి నిరంతరమైన ప్రయత్నం చేస్తోంది. ఇంతవరకూ సినిమాలు .. వెబ్ సిరీస్ లు .. టాక్ షోలు అందిస్తూ వచ్చిన 'ఆహా', ఈ సారి దసరా పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని, భక్తి ప్రధానమైన ఒక వెబ్ సిరీస్ ను తీసుకొస్తోంది. బీవీఎస్ రవి కథను అందించిన ఆ వెబ్ సిరీస్ పేరే 'సర్వం శక్తిమయం'

'దసరా' పండుగ అనేది శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి ఆరాధనకు సంబంధించింది. అందువలన ఈ 10 రోజులలో 10 ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సిరీస్ ను అందించనున్నారు. ఒక నాస్తికుడి ప్రయాణం అష్టాదశ శక్తి పీఠాల దిశగా ఎలా సాగింది? శక్తి పీఠాల దర్శనం తరువాత అతను ఆస్తికుడిగా ఎలా మారిపోయాడు? అనేదే ప్రధానమైన కథాంశం. 

 ఈ 10 ఎపిసోడ్స్ లో ఈ కథను ఫాలో అవుతున్న వాళ్లంతా 18 శక్తిపీఠాలు దర్శనం చేసుకోవచ్చు. శ్రీలంకలోని శక్తి పీఠం కూడా ఈ సిరీస్ లో కనిపించనుంది. అంకిత్ - విజయ్ - కౌముది నిర్మించిన ఈ వెబ్ సిరీస్ కి, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. ప్రియమణి .. సంజయ్ సూరి .. సుబ్బరాజు ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్, ఈ నెల 20వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.
Priyamani
Sanjay Soori
Subbaraju
Sarvam Shakthimayam

More Telugu News