KCR: తిరుమల వెంకన్నకు తలనీలాలు సమర్పించిన కేసీఆర్ భార్య శోభ

KCR wife offers prayers to Tirumala Venkateswara swamy
  • నిన్ననే తిరుమలకు చేరుకున్న కేసీఆర్ భార్య శోభ
  • తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్న కేసీఆర్ సతీమణి
  • శోభను ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించిన అర్చకులు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారికంగా ఎలాంటి బులెటిన్ విడుదల కాకపోవడంతో పార్టీలకు అతీతంగా అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ తరుణంలో ఆయన భార్య శోభ తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తన భర్త ఆరోగ్యం కోసం స్వామిని మొక్కుకుని, తలనీలాలను సమర్పించారు. 

నిన్ననే తిరుమలకు చేరుకున్న ఆమె... ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. అనంతరం శ్రీవారి అర్చన సేవలో పాల్గొని స్వామివారి ఆశీస్సులను తీసుకున్నారు. శోభకు అర్చకులు, టీటీడీ అధికారులు స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు. ఆమెను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందించారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పక్కనే ఉండి ఆమె కు స్వామివారి దర్శనం చేయించారు.
KCR
Wife
Tirumala

More Telugu News