Israel: దేశం కోసం కదనరంగంలోకి ఇజ్రాయెలీ జర్నలిస్టు.. భార్యకు వీడ్కోలు.. వీడియో వైరల్

Israeli Journalist Called Up To Fight For Country
  • హమాస్ మెరుపు దాడితో ఇజ్రాయెల్ ఉక్కిరిబిక్కిరి
  • హమాస్ ఉగ్రవాదులను కోలుకోలేని దెబ్బకొట్టాలని భావిస్తున్న ఇజ్రాయెల్
  • పూర్తిస్థాయి యుద్ధానికి సన్నద్దం
  • యుద్ధానికి 3 లక్షల మంది పౌరులను సిద్ధం చేసిన ఇజ్రాయెల్
హమాస్ మెరుపుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. తమ భూభాగంపై తీవ్ర నష్టం కలిగించిన హమాస్‌పై ఈసారి కొట్టే దెబ్బ మామూలుగా ఉండదని ఇజ్రాయెల్ ఇప్పటికే ప్రకటించింది. హమాస్ అకృత్యాలకు చలించిపోయిన ఇజ్రాయెలీలు కదనరంగంలోకి నేరుగా దిగుతున్నారు. ఈ క్రమంలో దాదాపు 3 లక్షల మందిని ఇజ్రాయెల్ ప్రభుత్వం సన్నద్ధం చేసింది.  వీరిలో ప్రముఖ జర్నలిస్టు హనన్యా నఫ్తాలీ కూడా ఉన్నారు.

యుద్ధానికి వెళ్తున్న నఫ్తాలీ.. తన భార్యను హత్తుకున్న ఫొటోను ఎక్స్‌లో షేర్ చేస్తూ భావోద్వేగ పోస్టు పెట్టారు. తన గైర్హాజరీలో తన సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ‘‘నా దేశాన్ని రక్షించుకునేందుకు, సేవ చేసేందుకు వెళ్తున్నాను. నా భార్య ‘ఇండియా నఫ్తాలీ’కు గుడ్‌బై చెప్పేశాను. ఆమె నన్ను ఆశీర్వదించింది. భగవంతుడి రక్షణ నాకు అండగా ఉంటుందని చెప్పింది. ఇక నుంచి నా తరపున నా సోషల్ మీడియా ఖాతాను ఆమె నిర్వహిస్తుంది’’ అని రాసుకొచ్చారు.  

ఆ తర్వాత నఫ్తాలీ మరో వీడియోను పోస్టు చేస్తూ.. తాను యుద్ధానికి వెళ్తున్నది తమ సరిహద్దులను కాపాడుకోవడం కోసం మాత్రమే కాదని, తమ ఇళ్లను, కుటుంబాలను కాపాడుకోవడానికని పేర్కొన్నారు. ఓ బాంబు షెల్టర్‌లో నఫ్తాలీ-ఇండియా ఇద్దరూ ఉన్న వీడియో వైరల్ అయింది.
Israel
Hamas
Israel War
Hananya Naftali
India Naftali

More Telugu News