Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ అర్థాంగి శోభ

KCR wife shobha visits Thirumala for venkateshwara swamy darshan
  • సోమవారం తిరుమల వెళ్లిన కేసీఆర్ ఆర్ధాంగి కల్వకుంట్ల శోభ
  •  నేడు ఉదయం తోమాల, సుప్రభాత సేవలో పాల్గొన్న వైనం
  • ఆమె వెంట ఉండి దర్శనానికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే చెవిరెడ్డి
తెలంగాణ సీఎం కేసీఆర్ అర్ధాంగి శోభ నేడు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఆమె తోమాల సుప్రభాత సేవ, అనంతరం శ్రీవారి అర్చనలో పాల్గొని స్వామి ఆశీస్సులు పొందారు. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆమెను దగ్గరుండి దర్శనానికి తీసుకెళ్లారు. తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నేపథ్యంలో ఆమె శ్రీవారి దర్శనం చేసుకున్నారు.
Tirumala
Shobha
KCR

More Telugu News