Congress: తనపై పోటీ చేస్తున్న బీజేపీ నేత కాళ్లు మొక్కిన కాంగ్రెస్ ఎమ్మెల్యే... ఇదిగో వీడియో

Congress MLA Sanjay Shukla touched the feet of BJP leader Kailash Vijayvargiya
  • ఆదివారం ఇండోర్‌లో జరిగిన ఆసక్తికర సంఘటన
  • ఇండోర్-1 నుంచి ఎమ్మెల్యేగా ఉన్న కాంగ్రెస్ నేత సంజయ్ శుక్లా
  • బీజేపీ నుంచి బరిలోకి దిగుతున్న కైలాస్ విజయ్ వర్గియా
  • కైలాస్ విజయ్ వర్గియా కాళ్లకు నమస్కరించిన సంజయ్ శుక్లా
ఇండోర్-1 నియోజక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్ శుక్లా తిరిగి అదే పార్టీ నుంచి మరోసారి బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే బీజేపీ సీనియర్ నేత కైలాస్ విజయ్ వర్గియా పాదాలను తాకడం గమనార్హం. ఇదే ఇండోర్-1 స్థానం నుంచి వచ్చే మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ నుంచి కైలాస్ పోటీ చేయనున్నారు. ఆదివారం ఈ ఇద్దరు ప్రత్యర్థులు ఒకేవేదికపై కనిపించారు. ఈ సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇండోర్‌లో జరిగిన ఓ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే సంజయ్‌ శుక్లా హాజరయ్యారు. ఆ తర్వాత కైలాస్ విజయవర్గియా వచ్చారు. ఈ క్రమంలో కైలాస్ ‌ను చూసిన శుక్లా ఆయన వద్దకు వెళ్లి పాదాలకు నమస్కరించారు. అనంతరం ఇద్దరూ కలిసి ఫొటోకు పోజులు ఇచ్చి, ఒకరినొకరు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. తనకు ప్రత్యర్థిగా నిలబడిన బీజేపీ నేత పాదాలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే నమస్కరించడం చర్చకు దారి తీసింది.
Congress
BJP
Madhya Pradesh

More Telugu News