రాజస్థాన్‌లోనూ పోటీ చేస్తాం: మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ

  • తెలంగాణలో ఎన్నిచోట్ల పోటీ చేస్తామనేది త్వరలో చెబుతామని వెల్లడి
  • అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్న అసదుద్దీన్
  • రాజస్థాన్‌లో మూడుచోట్ల పోటీ చేస్తామన్న హైదరాబాద్ ఎంపీ
తెలంగాణ రాష్ట్రంలో తమకు ఎమ్మెల్యేలు ఉన్నారని, ఎన్నిచోట్ల పోటీ చేస్తామనే అంశంపై త్వరలో చెబుతామని మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు. ఈ రోజు తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసదుద్దీన్ మాట్లాడుతూ... ఈసీ ఎన్నికల తేదీలను ప్రకటించిందని, తాము అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాజస్థాన్‌లో మాత్రం మూడు స్థానాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లులో కులగణన చేయాలని డిమాండ్ చేశారు.

Asaduddin Owaisi
MIM
Telangana
Telangana Assembly Election
Rajasthan

More Telugu News