Chandrababu: చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

ACB Court dismisses Chandrababu bail and custody petitions
  • స్కిల్ కేసులో చంద్రబాబు పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కొట్టేసిన కోర్టు
  • సీఐడీ కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా డిస్మిస్ చేసిన కోర్టు
  • ప్రస్తుతం పీటీ వారెంట్లపై విచారిస్తున్న కోర్టు
టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టులో నిరాశ ఎదురయింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. ఇదే సమయంలో సీఐడీ దాఖలు చేసిన కస్టడీ పొడిగింపు పిటిషన్ ను కూడా కోర్టు డిస్మిస్ చేసింది. ప్రస్తుతం చంద్రబాబుపై దాఖలైన పీటీ వారెంట్లపై ఏసీబీ కోర్టులో విచారణ ప్రారంభమైంది. మరోవైపు ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, అంగళ్లు అల్లర్ల కేసుల్లో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. స్కిల్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో ఎలాంటి తీర్పు వెలువడనుందో అనే ఉత్కంఠ నెలకొంది. 

Chandrababu
Telugudesam
Bail
Custody
ACB Court

More Telugu News