పేలిన ఫ్రిడ్జ్.. ముగ్గురు చిన్నారుల సహా కుటుంబంలోని ఐదుగురి మృతి
- పంజాబ్‌లోని జలంధర్‌లో ఘటన
- భారీ శబ్దంతో పేలిన ఫ్రిడ్జ్‌లోని కంప్రెషర్
- ఆ వెంటనే ఇంటికి మంటలు
పేలుడుతో ఒక్కసారిగా ఇంట్లో మంటలు అంటుకున్నాయి. తీవ్రంగా గాయపడిన యశ్‌పాల్ ఘాయ్ (70), రుచి ఘాయ్ (40), మాన్సా (14), దియా (12), అక్షయ్ (10)లను ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని శాంపిల్స్ సేకరించింది.