Sikkim Flash Floods: సిక్కిం ఫ్లాష్ ఫ్లడ్స్‌లో 60 దాటిన మృతుల సంఖ్య... చిక్కుకుపోయిన 1700 మంది పర్యాటకుల కోసం రంగంలోకి సైన్యం

Sikkim flash floods Toll over 60 1700 tourists still stuck
  • తీస్తా నది నుంచి 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పశ్చిమ బెంగాల్ అధికారులు
  • ఒక్క సిక్కింలోనే 26 మంది మృతి
  • చిక్కుకుపోయిన పర్యాటకుల్లో 63 మంది విదేశీయులు
  • తరలింపును అడ్డుకుంటున్న ప్రతికూల వాతావరణం
సిక్కింలోని తీస్తా రివర్‌కు ఇటీవల సంభవించిన మెరుపు వరదల కారణంగా 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇంకా 105 మంది ఆచూకీ తెలియరాలేదు. వారి కోసం రెస్క్యూ బృందాలు గాలిస్తున్నాయి. 1,655 ఇళ్లు ధ్వంసం కాగా నాలుగు జిల్లాల్లో 14 బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి.

తీస్తా నది నుంచి తాము ఇప్పటి వరకు 40 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పశ్చిమబెంగాల్‌లోని జల్పాయిగురి జిల్లా అధికారులు తెలిపారు. వీటిలో ఇప్పటి వరకు 10 మృతదేహాలను గుర్తించారు. ఒక్క సిక్కింలోనే 26 మంది మృతి చెందారు. 

మరోవైపు, ఉత్తర సిక్కింలోని లాచెన్, లాచుంగ్, తంగు, చుంగ్తాంగ్ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన 63 మంది విదేశీయులు సహా 1,700 మంది పర్యాటకులను రక్షించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. వారికి ఆహారం, వైద్య సహాయం, కమ్యూనికేషన్ సౌకర్యం కల్పిస్తున్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉండడంతో వారిని సురక్షితంగా తరలించడంలో జాప్యం జరగుతున్నట్టు అధికారులు తెలిపారు.
Sikkim Flash Floods
West Bengal
Teesta River
Sikkim Tourinsts

More Telugu News