Oil Prices: ఇజ్రాయెల్ యుద్ధం ఎఫెక్ట్.. పెరుగుతున్న ఆయిల్ ధరలు

  • ఒక్కరోజులోనే 4 శాతం పెరిగిన ధర
  • పాలస్తీనా, ఇజ్రాయెల్ నుంచి పడిపోనున్న ఎగుమతులు
  • గతంలోనే సప్లై తగ్గించుకున్న సౌదీ, రష్యా దేశాలు
Global Oil Prices Soar After Hamas Attack On Israel

ఇజ్రాయెల్, పాలస్తీనాలోని హమాస్ మిలిటెంట్ల మధ్య జరుగుతున్న యుద్ధం ప్రపంచ దేశాలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. హమాస్ దాడులు, ఇజ్రాయెల్ ప్రతిదాడుల నేపథ్యంలో సోమవారం ఆయిల్ ధరలు 4 శాతం పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి. ఓవైపు ఆంక్షల కారణంగా రష్యా ఆయిల్ ఎగుమతులు తగ్గించుకుంది. అదే సమయంలో ఆయిల్ ఎగుమతులపై సౌదీ కూడా స్వీయ నియంత్రణ విధించుకుంది. తాజాగా జరుగుతున్న యుద్ధ ప్రభావం ఇజ్రాయెల్, పాలస్తీనాల ఆయిల్ ఎగుమతులపై పడే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

దీంతో ఆయిల్ ధరలు పెరుగుతున్నాయి. బ్రెంట్ క్రూడాయిల్ ధరలు సోమవారం ఉదయం 4.7 శాతం పెరిగాయి. బ్యారెల్ 86.65 అమెరికన్ డాలర్లకు చేరగా.. టెక్సాస్ ఇంటర్మీడియెట్ 4.5  శాతం పెరిగి బ్యారెల్ 88.39 డాలర్లకు చేరింది. ఇజ్రాయెల్, హమాస్ ల మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో సమసిపోయేలా కనిపించకపోవడంతో ముడి చమురు ధరలు మరింత పైకి చేరొచ్చని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

More Telugu News