Bandla Ganesh: కాంగ్రెస్ టికెట్‌పై కూకట్‌పల్లి నుంచి బరిలోకి బండ్ల గణేశ్!

  • రాజకీయాల్లో ఇటీవల మళ్లీ యాక్టివ్ అయిన బండ్ల గణేశ్
  •  గ్రేటర్ హైదరాబాద్‌లో బలమైన సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని నిర్ణయం
  •  పోటీకి ఓకే చెప్పిన బండ్ల గణేశ్!
Cine producer Bandla Ganesh contest from Kukatpally from congress ticket

ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ కూకట్‌పల్లి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ప్రచారం చేసిన ఆయన ఆ తర్వాత కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. ఇటీవల మళ్లీ క్రియాశీలంగా ఉంటున్న గణేశ్ తరచూ రాజకీయాలపై వ్యాఖ్యలు చేస్తున్నారు. 

మరోవైపు, గ్రేటర్ హైదరాబాద్‌లో ఓ టికెట్‌ను బలమైన సామాజిక వర్గానికి ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో బండ్ల గణేశ్ పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇప్పటికే అధిష్ఠానం ఆయనతో మాట్లాడిందని, గణేశ్ కూడా అందుకు అంగీకరించారని పార్టీ వర్గాల సమాచారం.

More Telugu News