Karnataka: దారుణం.. బాణసంచా పేలి 11 మంది దుర్మరణం

Fire accident in karnataka firecrackers godown kills 11
  • కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌లో ఘటన
  • శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు
  • క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా 11 మంది మృతి

కర్ణాటకలో బాణసంచా పేలి ఏకంగా 11 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోడౌన్‌కు తమిళనాడు శివకాశి నుంచి బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు.

  • Loading...

More Telugu News