Team India: వర్షం కారణంగా ఫైనల్ రద్దు... ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టుకు స్వర్ణం

  • చైనాలోని హాంగ్ ఝౌలో ఆసియా క్రీడలు
  • భారత్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య క్రికెట్ ఫైనల్
  • 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసిన ఆఫ్ఘన్
  • హాంగ్ ఝౌలో ఎడతెరిపిలేని వర్షం
  • మెరుగైన సీడింగ్ ఆధారంగా టీమిండియాను విజేతగా ప్రకటించిన నిర్వాహకులు
Team India claims gold in Asian Games Cricket event

ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్ లో భారత జట్టుకు స్వర్ణం లభించింది. ఇవాళ ఆఫ్ఘనిస్థాన్ తో ఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే ముగిసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. 

మొదట బ్యాటింగ్ కు దిగిన ఆఫ్ఘనిస్థాన్ 18.2 ఓవర్లలో 5 వికెట్లకు 112 పరుగులు చేసింది. ఈ దశలో మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో మ్యాచ్ ను రద్దు చేశారు. అయితే, టోర్నీలో ఆఫ్ఘనిస్థాన్ కంటే టీమిండియా సీడింగ్ మెరుగ్గా ఉండడంతో, టీమిండియానే విజేతగా ప్రకటించారు. దాంతో, రుతురాజ్ గైక్వాడ్ సేనను స్వర్ణం వరించింది. 

ఆసియా క్రీడల క్రికెట్ ఈవెంట్లో భారత పురుషుల జట్టు పాల్గొనడం ఇదే తొలిసారి. అరంగేట్రంలోనే పసిడి పతకం దక్కడంతో భారత క్రీడా వర్గాల్లో హర్షం నెలకొంది. కాగా, హాంగ్ ఝౌ ఆసియా క్రీడల్లో భారత్ కు ఇది 27వ స్వర్ణం.

More Telugu News