Israel: గాజాపై యుద్ధాన్ని ప్రకటించిన ఇజ్రాయెల్

  • ఇజ్రాయెల్ పై 5 వేల రాకెట్లను ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు
  • హమాస్ మిలిటెంట్లు తమ దేశంలో చొరబడ్డారన్న ఇజ్రాయెల్
  • దాడులకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించిన నెతన్యాహు కార్యాలయం
Israel declares war on Gaza

తమ దేశంపై రాకెట్లను ప్రయోగించిన పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. ఈ ఉదయం 6.30 గంటల సమయంలో గాజా స్ట్రిప్ నుంచి భారీ ఎత్తున రాకెట్లు ఇజ్రాయెల్ పైకి దూసుకొచ్చాయి. వెంటనే అప్రమత్తమైన ఇజ్రాయెల్ సైన్యం గంటకు పైగా సైరన్లతో ప్రజలను అప్రమత్తం చేసింది. బాంబు షెల్టర్ల సమీపంలోనే ప్రజలు ఉండాలని హెచ్చరించింది. మరోవైపు పెద్ద సంఖ్యలో హమాస్ మిలిటెంట్లు గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ భూభాగంలోకి చొరబడినట్టు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. 


 మరోపక్క, ఇజ్రాయెల్ పై సైనిక చర్యను ప్రారంభిస్తున్నామని హమాస్ మిలిటరీ గ్రూపు ప్రకటించింది. ఈ ఉదయం 5 వేలకు పైగా రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించినట్టు తెలిపింది. ఆపరేషన్ అక్సా ఫ్లడ్ పేరుతో ఈ సైనిక చర్యను చేపట్టినట్టు వెల్లడించింది. ఇంకోవైపు హమాస్ రాకెట్ల దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా... పలువురు గాయపడ్డారు. ఈ నేపథ్యంలో గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ప్రకటించింది. 

రాకెట్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం నుంచి పాలస్తీనాకు తీవ్ర హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ దాడులకు హమాస్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.

More Telugu News