Laya: టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న హోమ్లీ హీరోయిన్ లయ?

Heroine Laya starting second innings in Tollywood with Nithin movie
  • పదహారణాల అచ్చ తెలుగు హీరోయిన్ లయ
  • పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిన హోమ్లీ హీరోయిన్
  • హీరో నితిన్ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోందని వార్తలు
లయ... ఈ పేరు వినగానే అచ్చ తెలుగు హీరోయిన్ మన కళ్ల ముందు మెదులుతుంది. తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన లయ... హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత గణేష్ గొర్తి అనే డాక్టర్ ను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిపోయింది. ప్రస్తుతం ఆమె భర్త, పిల్లలతో యూఎస్ లో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతోంది. అమెరికాలో ఉంటున్నప్పటికీ... సోషల్ మీడియా ద్వారా ఆమె అభిమానులకు రెగ్యులర్ గా టచ్ లోనే ఉంటోంది. 

ఇప్పుడు లయకు సంబంధించిన ఒక వార్త వైరల్ అవుతోంది. టాలీవుడ్ లోకి లయ రీ ఎంట్రీ ఇవ్వబోతోందనేదే ఆ వార్త. పవన్ కల్యాణ్ తో 'వకీల్ సాబ్' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ వేణు శ్రీరామ్.. తాజాగా హీరో నితిన్ తో 'తమ్ముడు' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం లయతో చర్చలు జరపడం, ఆమె ఓకే చెప్పడం జరిగిపోయాయని చెపుతున్నారు. అయితే చిత్రంలో లయ పాత్ర ఏమిటనేది మాత్రం వెల్లడి కాలేదు. లయ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తోందనే వార్తతో ఆమె అభిమానులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Laya
Tollywood
Re Entry
Nithin

More Telugu News