BL Santhosh: తెలంగాణ ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేత బీఎల్ సంతోష్

BJP leader BL Santhosh sensational comments on Telangana Assembly elections results
  • తెలంగాణలో హంగ్ వస్తుందన్న బీఎల్ సంతోష్
  • ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది బీజేపీనే అని ధీమా
  • ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు నిత్యం ప్రజల్లోనే ఉండాలని సూచన
రెండు, మూడు రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడబోతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులను ప్రకటించింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కూడా అభ్యర్థులను దాదాపు ఖరారు చేసినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఎన్నికల ఫలితాలపై బీజేపీ సీనియర్ నేత బీఎల్ సంతోష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో హంగ్ రాబోతోందని ఆయన తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది బీజేపీనే అని ధీమా వ్యక్తం చేశారు. మరోవైపు బీజేపీ నుంచి టికెట్లు ఆశిస్తున్న వారికి ఆయన కీలక సూచన చేశారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు అనునిత్యం ప్రజల్లో ఉండాలని చెప్పారు. సీట్ల కేటాయింపులు ఢిల్లీలో జరగవని, తెలంగాణలోనే జరుగుతాయని తెలిపారు. టికెట్ల కోసం అనవసరంగా నేతల చుట్టూ తిరగొద్దని సూచించారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మాట్లాడుతూ, మోదీ నాయకత్వంలో భారత్ దూసుకుపోతోందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను బీజేపీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేయలేదని విమర్శించారు. జాతిని ఐక్యంగా ఉంచేది బీజేపీ మాత్రమేనని... అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలపడుతోందని చెప్పారు.
BL Santhosh
BJP
JP Nadda
Telangana
Hung

More Telugu News