rs 2000 note: రూ.2000 నోట్లను డెడ్‌లైన్ తర్వాత కూడా మార్చుకోవచ్చు.. ఎక్కడంటే..!

  • రేపటితో ముగియనున్న రూ.2000 నోటు మార్పిడి గడువు
  • అక్టోబర్ 8 నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మార్చుకోవచ్చునన్న ఆర్బీఐ
  • తపాలా శాఖ సేవలను కూడా వినియోగించుకోవచ్చునని స్పష్టీకరణ
Will you be able to deposit Rs 2000 notes in banks after deadline

రూ.2000 నోట్ల మార్పిడికి సంబంధించి పొడిగించిన గడువు ముగియనున్న నేపథ్యంలో ఆర్బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ నెల 8వ తేదీ తర్వాత కూడా నోట్లను మార్చుకోవచ్చునని స్పష్టం చేసింది. అయితే ఈ వెసులుబాటు కేవలం ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలలో మాత్రమే ఉంటుందని తెలిపింది. ఈ మేరకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ వెల్లడించారు. ఈ ఏడాది మే 19న రూ.2వేల నోట్ల ఉపసంహరణ ప్రక్రియను ప్రకటించే సమయానికి రూ.3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణిలో ఉన్నట్లు తెలిపారు. ఇందులో 87 శాతం డిపాజిట్ల రూపంలో వచ్చాయన్నారు.

రూ.2వేల నోట్ల మార్పిడి గడువును తొలుత సెప్టెంబర్ 30 వరకు ఇచ్చారు. ఆ తర్వాత అక్టోబర్ 7 వరకు పొడిగించారు. అయితే 8వ తేదీ నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో నోట్లను మార్చుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దాదాపు ప్రతి రాష్ట్ర రాజధానిలోను ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయని తెలిపారు. తపాలా శాఖ సేవలను కూడా వినియోగించుకోవచ్చునని చెప్పారు.

More Telugu News