Nara Brahmani: మనమెందుకు చీకట్లో ఉండాలి?: నారా బ్రాహ్మణి

  • కాంతితో క్రాంతి కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామన్న నారా బ్రాహ్మణి
  • మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేశారని విమర్శ
  • రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలియదని వ్యాఖ్య
Why should we be in darkness asks Nara Brahmani

తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన 'కాంతితో క్రాంతి' కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేద్దామని టీడీపీ యువనేత నారా లోకేశ్ భార్య బ్రాహ్మణి అన్నారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ... మన రాష్ట్రాన్ని, మన భవిష్యత్తును చీకటి చేసి... దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకో అని కొందరు అంటున్నారని ఆమె విమర్శించారు. చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి, తిరుగులేదని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వాళ్లకు తెలియదని అన్నారు. మనమెందుకు చీకట్లో ఉండాలని ఆమె ప్రశ్నించారు. కాంతితో క్రాంతి కార్యక్రమంలో భాగంగా రేపు రాత్రి 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇళ్లలో లైట్స్ ఆఫ్ చేయాలని... ఇళ్ల నుంచి బయటకు వచ్చి దీపాలు లేదా కొవ్వొత్తులు లేదా సెల్ ఫోన్ టార్చ్ వెలిగిద్దామని చెప్పారు. రోడ్డుపై ఉంటే వాహనాల లైట్లు బ్లింక్ చేద్దామని తెలిపారు.

More Telugu News