Nara Lokesh: రాజమండ్రికి వెళ్తున్న లోకేశ్ కు రోడ్డుమార్గంలో జన నీరాజనం.. ఫొటోలు ఇవిగో!

- అమరావతి నుంచి రాజమండ్రికి వెళ్తున్న లోకేశ్
- లోకేశ్ కు ఎక్కడికక్కడ సంఘీభావం తెలుపుతున్న ప్రజలు
- చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని ధైర్యం చెపుతున్న లోకేశ్
టీడీపీ యువనేత నారా లోకేశ్ అమరావతి నుంచి రాజమండ్రికి వెళ్తున్న సంగతి తెలిసిందే. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న తన తండ్రి చంద్రబాబును లోకేశ్ ములాఖత్ ద్వారా మధ్యాహ్నం 3 గంటలకు కలవనున్నారు. భారీ ర్యాలీగా రాజమండ్రికి రోడ్డు మార్గంలో వెళ్తున్న లోకేశ్ కు ఎక్కిడికక్కడ ప్రజలు సంఘీభావాన్ని ప్రకటిస్తున్నారు. లోకేశ్ వాహనశ్రేణి వెళ్తున్న మార్గంలో నిలబడి ఆయనకు అభివాదం చేస్తున్నారు. అంతిమ విజయం ధర్మానిదే, చంద్రబాబుతో మేము అంటూ ప్లకార్డులు పట్టుకుని వారు తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ప్రజల కోసం లోకేశ్ వాహనం దిగి వారితో ముచ్చటిస్తున్నారు. లోకేశ్ కు మహిళలు హారతి ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. చంద్రబాబు త్వరలోనే బయటకు వస్తారని, ధైర్యంగా ఉండాలని చెపుతూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు.





