Tilak Varma: హాఫ్ సెంచరీ తర్వాత వెరైటీగా సెలబ్రేట్ చేసుకున్న తెలుగు క్రికెటర్

  • పొట్ట భాగంలో టాటూ చూపించిన వర్మ
  • దేవుడికి నమస్కరిస్తూ సంబరం
  • కుడిచేత్తో బ్యాటింగ్, ఎడమ చేత్తో బౌలింగ్ తో ఆకట్టుకున్న తీరు
Tilak varma special celebration for his mother goes viral

ఏషియన్ గేమ్స్ లో తెలుగు కుర్రాడు, యువ క్రికెటర్ తిలక్ వర్మ రెచ్చిపోయాడు. టీ20 సెమీ ఫైనల్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో తిలక్ వర్మ అర్ధ సెంచరీ (హాఫ్) సాధించి ఔరా అనిపించాడు. కేవలం 26 బంతుల్లోనే వర్మ 55 పరుగులు పారించాడు. రెండు ఫోర్లు, ఆరు సిక్సర్లతో చెలరేగి ఆడాడు. దీంతో 9 వికెట్ల తేడాతో భారత్ జట్టు ఘన విజయం సాధించి ఫైనల్ కు దూసుకుపోయింది. 

అర్ధ సెంచరీ సాధించిన వెంటనే తిలక్ వర్మ మైదానంలో తన సంతోషాన్ని వ్యక్త పరిచాడు. టీషర్ట్ పైకి ఎత్తి పొట్ట భాగంలో కుడివైపు ఉన్న టాటూని మ్యూచ్ వీక్షిస్తున్న తల్లికి చూపించి నమస్కరించాడు. ఇది చూసే వారిని ఆకర్షించింది. బాల్ తోనూ వర్మ ఆకట్టుకున్నాడు. ఒక వికెట్ తీశాడు. తిలక్ వర్మ మరింత సాధన చేస్తే గొప్ప బౌలర్ అవుతాడంటూ ట్విట్టర్ యూజర్లలో కొందరు కామెంట్ చేశారు. 20 ఏళ్ల తిలక్ వర్మ మల్టీ టాలెంటెడ్ క్రికెటర్ అని చెప్పుకోవాలి. ఎడమ చేతి వాటం బ్యాట్స్ మ్యాన్ అయిన వర్మ, కుడి చేతితో బౌలింగ్ చేయడాన్ని ప్రత్యేకతగా చెప్పుకోవాలి. రైట్ ఆర్మ్ ఆఫ్ బ్రేక్ బౌలింగ్ లో వర్మ ప్రతిభ కలిగిన బౌలర్.

More Telugu News