Allu Arjun: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం, మేడమ్ టుస్సాడ్స్‌లో మైనపు విగ్రహం

All set to allu arjun wax in madame tussauds
  • బన్నీ నుంచి కొలతలు తీసుకుంటున్న వీడియోను షేర్ చేసిన టుస్సాడ్స్
  • టుస్సాడ్స్‌లో తన మైనపు బొమ్మ ఏర్పాటు చేయనుండటం తనకు సంతోషంగా ఉందని వ్యాఖ్య
  • ఇది తనకు ప్రత్యేకమైన అనుభూతి అన్న అల్లు అర్జున్
సినీ నటుడు అల్లు అర్జున్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకున్నారు. ఇటీవల ఉత్తమ జాతీయ నటుడి అవార్డును దక్కించుకున్నారు. తాజాగా, ప్రతిష్టాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. దుబాయ్‌లో ఉన్న ఈ మ్యూజియంలో ఈ ఏడాదే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని మేడమ్ టుస్సాడ్స్ పేర్కొంది. అంతేకాదు బన్నీ నుంచి కొలతలు తీసుకున్న వీడియోను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.  

టుస్సాట్స్‌లో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేయనుండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని అల్లు అర్జున్ అన్నారు. ఇది తనకు ఓ రకంగా ప్రత్యేకమైన అనుభూతి అన్నారు. తాను చిన్నతనంలో టుస్సాడ్స్‌ను సందర్శించిన సందర్భాలు ఉన్నాయని, అలాంటి మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని చూస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు.
Allu Arjun
dubai
madame tussauds

More Telugu News