Pawan Kalyan: మసీదులో నమాజ్ రావడంతో ప్రసంగం ఆపిన పవన్... సనాతన ధర్మమే అందుకు కారణమని వెల్లడి

  • ఉమ్మడి కృష్ణా జిల్లాలో పవన్ కల్యాణ్ వారాహి యాత్ర
  • ముదినేపల్లిలో సభ
  • మసీదు నుంచి నమాజు వస్తే ప్రసంగం ఆపమని సనాతన ధర్మమే చెప్పిందని వెల్లడి
  • జనసేన అన్ని మతాలను గౌరవిస్తుందని స్పష్టీకరణ
Pawan Kalyan mentions Sanatana Dharma in Mudinepally

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి కృష్ణా జిల్లాలో వారాహి విజయ యాత్ర కొనసాగిస్తున్నారు. అందులో భాగంగా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లిలో సభ నిర్వహించారు. ఈ సభలో పవన్ ప్రసంగిస్తుండగా మసీదు నుంచి నమాజ్ వినవచ్చింది. దాంతో ఆయన తన ప్రసంగాన్ని నిలిపివేశారు. 

అనంతరం కొనసాగిస్తూ, మసీదు నుంచి నమాజ్ వస్తే ప్రసంగం ఆపమని నా సనాతన ధర్మం నేర్పింది అని వెల్లడించారు. భారత్ ఎంతో పవిత్రమైన నేల అని, ఎప్పటికీ ఇతర మతాలపై దాడులు చేయాలని ప్రేరేపించదని స్పష్టం చేశారు. 

జనసేన అన్ని మతాలను గౌరవిస్తుందని, అందుకే నా మతం గురించి, ఇతర మతాల గురించి బలంగా మాట్లాడగలనని వివరించారు. తాను ప్రజలందరినీ తన సొంత కుటుంబంలా, సొంత అన్నదమ్ముళ్లు, సొంత అక్కచెల్లెళ్లలా చూస్తానని ఉద్ఘాటించారు. కులాల వారీగా ఎప్పుడూ చూడబోనని అన్నారు.

More Telugu News