Cricket: ప్రపంచ కప్ సమయంలో ఒక సెకన్ యాడ్‌కు రూ.3 లక్షలు!

Global brands splurge millions on World Cup ad spots
  • ప్రపంచ కప్ టోర్నీలో అన్ని బ్రాండ్స్ కలిసి యాడ్ కోసం చేసే ఖర్చు రూ.2 వేల కోట్లు
  • మ్యాచ్ జరుగుతున్న సమయంలో పది సెకన్ల స్లాట్‌కు రూ.30 లక్షలు
  • కోట్లు ఖర్చు చేస్తోన్న కోకాకోలా, గూగుల్ పే, హిందూస్థాన్ యూనీలీవర్, ఆరామ్ కో, ఎమిరేట్స్, నిస్సాన్ మోటార్
క్రికెట్ ప్రపంచ కప్‌ను కోట్లాది మంది అభిమానులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వీక్షిస్తారు. దాదాపు వంద కోట్ల మంది ఈ మెగా టోర్నీని వీక్షిస్తారని భావిస్తున్నారు. అందుకే మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో మధ్యలో యాడ్ కోసం బడా కంపెనీలు కోట్లాది రూపాయలు గుమ్మరిస్తాయి. ఈ నేపథ్యంలో ప్రకటనల రేటు కూడా భారీగానే పెరిగింది. ఈ టోర్నీకి సంబంధించి అన్ని బ్రాండ్లు కలిపి ప్రకటనల కోసం 240 మిలియన్ డాలర్లను ఖర్చు చేయనున్నాయి. అంటే మన కరెన్సీలో రూ.2 వేల కోట్లు.

క్రికెట్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో పది సెకన్ల స్లాట్ కోసం కార్పోరేట్ దిగ్గజాలు రూ.30 లక్షల వరకు వెచ్చిస్తున్నాయి. అంటే సెకనుకు రూ.3 లక్షల మొత్తాన్ని ఖర్చు చేయనున్నాయి. స్లాట్ ఖరీదు గత ప్రపంచ కప్ కంటే నలభై శాతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. క్రికెట్ ప్రపంచ కప్ సమయంలో ప్రకటనల కోసం భారీగా ఖర్చు చేయనున్న కంపెనీల్లో కోకాకోలా, గూగుల్ పే, హిందుస్థాన్ యూనీలీవర్, ఆరామ్ కో, ఎమిరేట్స్, నిస్సాన్ మోటార్ వంటివి ఉన్నాయి.
Cricket
world cup
India

More Telugu News