Chandrababu: ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ లో ఉంచిన హైకోర్టు

AP High Court reserves verdict on Chandrababu Naidu bail petition
  • ఏపీ ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్
  • హైకోర్టులో నిన్నటి వాదనలకు నేడు కొనసాగింపు
  • ఇరుపక్షాల వాదనలు పూర్తి
  • రేపు నిర్ణయం వెలువరించనున్న హైకోర్టు ధర్మాసనం

ఏపీ ఫైబర్ నెట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు నేడు వాదనలు కొనసాగించింది. ఇరు వర్గాల నుంచి వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ లో ఉంచింది. 

కాగా, చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్ వాదనలు వినిపించారు. ప్రభుత్వ విధాన నిర్ణయాలకు చంద్రబాబును ఎలా బాధ్యుడ్ని చేస్తారంటూ వారు ప్రశ్నించారు. చంద్రబాబుపై రాజకీయ కక్షతో ఈ కేసు నమోదు చేశారని ఆరోపించారు. రెండేళ్ల క్రితమే కేసు నమోదు చేసి చంద్రబాబుకు నోటీసులు ఇవ్వలేదని లూథ్రా, అగర్వాల్ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికిప్పుడు ఈ కేసులో చంద్రబాబు పేరు చేర్చారని స్పష్టం చేశారు. 

ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ నిన్నటి నుంచి జరుగుతున్న సంగతి తెలిసిందే. నిన్న కొంత మేర వాదనలు విన్న న్యాయమూర్తి, తదుపరి విచారణ కొనసాగింపును నేటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News