nobel prize: నార్వే రచయిత జాన్ ఫోస్సేకు సాహిత్యంలో నోబెల్ బహుమతి

Norwegian Author Jon Fosse Wins Nobel Prize For Literature
  • 2023 సంవత్సరానికి గాను నోబెల్ దక్కించుకున్న నార్వేజియన్
  • మాటల్లో చెప్పలేని అంశాలకు ఆయన వినూత్న నాటకాలు, గద్యాలు గళంగా మారాయని వెల్లడి
  • ఏడేళ్ల వయస్సులో చావు అంచుల వరకు వెళ్లొచ్చిన జాన్ ఫోస్సే
2023 సంవత్సరానికి సాహిత్యంలో నార్వేజియన్ రచయిత జాన్ ఫోస్సేను నోబెల్ బహుమతి వరించింది. జాన్ఫోసోకు ఈ ఏడాది సాహిత్య నోబెల్ వరించినట్లు నోబెల్ అకాడమీ ప్రకటించింది. ఆయన రాసిన వినూత్న నాటకాలు, గద్యాలు... మాటల్లో చెప్పలేని ఎన్నో అంశాలకు గళంగా మారాయని స్వీడిష్ అకాడమీ తెలిపింది. జాన్ ఫోస్సే 1959లో నార్వేలోని హేగ్ సండ్ ప్రాంతంలో జన్మించారు. ఏడేళ్ల వయస్సులో ఘోర రోడ్డు ప్రమాదానికి గురై చావు అంచుల వరకు వెళ్లొచ్చారు. రచయితగా మారేందుకు ఈ ఘటన ఆయనకు స్ఫూర్తిగా నిలిచిందని అంటారు.
nobel prize
literature

More Telugu News