CBI: విశాల్ లంచం ఆరోపణల నేపథ్యంలో రంగంలోకి సీబీఐ

CBI takes over investigation into censor board bribery allegations levelled by actor Vishal
  • ముగ్గురు వ్యక్తులతో పాటు ఓ సీబీఎఫ్‌సీ అధికారిపై ఎఫ్ఐఆర్ నమోదు
  • నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించిన దర్యాఫ్తు సంస్థ
  • మెర్లిన్ మేనకా, జీజా రాందాస్, రాజన్ ఎం అనే ముగ్గురు మీడియేటర్లపై కేసు

తన సినిమా కోసం సెన్సార్ బోర్డు సభ్యులకు లంచం ఇచ్చానని సినీ నటుడు విశాల్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సీబీఐ రంగంలోకి దిగింది. విశాల్ ఆరోపణలకు సంబంధించి ముగ్గురు వ్యక్తులతో పాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారిపై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. నిందితుల ఇళ్లలోను సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన సీబీఐ పలువురిపై కేసు నమోదు చేసింది.

మెర్లిన్ మేనకా, జీజా రాందాస్, రాజన్ ఎం అనే ముగ్గురితో పాటు సీబీఎఫ్‌సీకి చెందిన ఓ అధికారిపై కేసు నమోదు చేసింది. నిందితుల ఇళ్లతో పాటు ముంబైలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. కాగా, విశాల్‌ను లంచం డిమాండ్ చేసింది సెన్సార్ బోర్డు సభ్యులు కాదని, థర్డ్ పార్టీ వారని సీబీఎఫ్‌సీ ఇప్పటికే స్పష్టం చేసింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది.

  • Loading...

More Telugu News