Whatsapp: వాట్సాప్ ఛానెల్స్ చికాకును వదిలించుకోవడం ఎలాగంటే..!

  • ఛానెల్స్ రాకతో పర్సనల్ చాట్ లో చికాకులు
  • స్టేటస్ ల చోటును ఆక్రమించిన వాట్సాప్ ఛానెల్స్
  • తొలగించుకోవడం ఎలాగో తెలియక ఇబ్బందిపడుతున్న యూజర్లు
How To Hide Whatsapp Channels In Android And Iphone

ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడంలో వాట్సాప్ ముందుంటుంది. అయితే, ఇటీవల వాట్సాప్ తీసుకొచ్చిన ఓ ఫీచర్ మాత్రం యూజర్లను చికాకు పెడుతోంది. పర్సనల్ గా చాట్ చేసుకునే చోట ఇలాంటి ఫీచర్ ఎందుకనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు ఇబ్బంది కలగకుండా వాట్సాప్ మార్పులు చేపట్టింది. వాట్సాప్ ఇటీవల తీసుకొచ్చిన ఛానెల్స్ ఫీచర్ కు ఇప్పుడిప్పుడే ఆదరణ లభిస్తోంది. అదే సమయంలో కొంతమంది యూజర్లు మాత్రం ఈ ఫీచర్ పై చిరాకు పడుతున్నారు.

స్టేటస్ లో అప్ డేట్స్ కింద ఛానెల్స్ ఫీచర్ ను వాట్సాప్ అందుబాటులో ఉంచింది. దీని ద్వారా సెలబ్రెటీలు, ప్రముఖ సంస్థలు, వార్తా సంస్థలు వాట్సాప్ లోనూ తమ ఫాలోవర్లకు అందుబాటులో ఉండే అవకాశం కలుగుతుంది. ఈ ఛానెల్స్‌ లో సెలబ్రెటీలు తమ అభిప్రాయాలను పంచుకోవచ్చు.. సంస్థలు తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవచ్చు. ఈ ఛానెల్స్ తో ఇబ్బంది పడుతున్న యూజర్లు ఇకపై వాటిని కనిపించకుండా మార్చేసుకోవచ్చని వాట్సాప్ పేర్కొంది. వాట్సాప్‌ ఛానల్స్‌ ఫీచర్‌ను హైడ్‌ చేసుకోవచ్చని చెప్పింది. 

ఇందుకోసం వాట్సాప్‌లోని ‘అప్‌డేట్స్‌’ ఆప్షన్‌లోకి వెళ్లాలి. కిందికి స్క్రోల్ చేస్తే ఛానల్స్‌ కనిపిస్తాయి. మీ వాట్సాప్‌ అకౌంట్ లో సరిపడా స్టేటస్‌లు ఉంటే ఛానెల్స్ మొత్తం ఆటోమేటిక్ గా కిందికి వెళతాయి. ఛానెల్స్‌ కనిపించకుండా చేయడానికి మరో మార్గం కూడా ఉంది. వాట్సాప్ లో మీరు ఫాలో అవుతున్న ఛానెల్స్ ను అన్ ఫాలో చేస్తే ఛానెల్స్ ఏవీ కనిపించవు. కేవలం స్టేటస్ లు మాత్రమే కనిపిస్తాయని నిపుణులు తెలిపారు. చాట్స్‌ను బ్యాకప్ చేసుకొని, కొత్త వెర్షన్‌ స్థానంలో వాట్సాప్ పాత వెర్షన్‌ ఇన్‌స్టాల్ చేసుకున్నా ఛానెల్స్ గొడవ వదిలించుకోవచ్చని చెప్పారు.

More Telugu News