Dengue: రూ. 450కే డెంగీకి ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందిస్తానంటున్న డాక్టర్!

Dengue treatment Rs 45 only says Dr Vasanth Kumar
  • అతి తక్కువకే చికిత్స అందిస్తానన్న డాక్టర్ వసంత్ కుమార్
  • సుల్తాన్‌బజార్ యూపీహెచ్‌లో అసిస్టెంట్ సివిల్ సర్జన్‌గా పనిచేస్తున్న వసంత్
  • కరోనాకు రూ. 45కే చికిత్స అందించానన్న వైద్యుడు
  • తన చికిత్సతో ఒక్క రోజులోనే ప్లేట్‌లెట్లు పెరుగుతున్నాయన్న వసంత్ కుమార్
ప్రభుత్వం, ఇండియన్ మెడికల్ కౌన్సిల్ (ఐసీఎంఆర్) కనుక సహకరిస్తే డెంగీకి అత్యంత చౌకగా చికిత్స అందిస్తానని హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ (యూపీహెచ్‌సీ) అసిస్టెంట్ సివిల్ సర్జన్ డాక్టర్ జీ వసంత్ కుమార్ తెలిపారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. 

గతంలో తాను కరోనాకు అత్యుత్తమ చికిత్స అందించినట్టు తెలిపారు. అప్పట్లో తాను కేవలం 45 రూపాయలకే కరోనాకు చికిత్స అందిస్తే రోగులు కోలుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు డెంగీకి కూడా ప్రపంచంలోనే అత్యుత్తమ చికిత్స అందిస్తున్నట్టు వివరించారు. కేవలం రూ. 450కే చికిత్స అందించానని, ఒక్క రోజులోనే రోగుల రక్తంలో ప్లేట్‌లెట్స్ పెరిగినట్టు చెప్పారు. ప్రభుత్వం, ఐసీఎంఆర్ సహకరిస్తే డెంగీకి అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తానని డాక్టర్ వసంత్ కుమార్ తెలిపారు.
Dengue
Dengue Fever
Platelets
Sultanbazar UPHC
Dr Vasnth Kumar

More Telugu News