MAD Movie: 'మ్యాడ్ ' హిట్ కొట్టడం ఖాయం: సిద్ధూ జొన్నలగడ్డ

  • ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకున్న 'మ్యాడ్'
  • సితార బ్యానర్లో నిర్మితమైన సినిమా 
  • ఈ నిర్మాతలు దొరకడం అదృష్టమన్న సిద్ధూ
  • తప్పకుండా పెద్ద హిట్ అవుతుందని వెల్లడి
MAD Movie Pre Release Event

ముగ్గురు ఇంజనీరింగ్ కుర్రాళ్ల కథగా 'మ్యాడ్' సినిమా రూపొందింది. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ నెల 6వ తేదీన విడుదల కానుంది. కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది. ఈ స్టేజ్ పై శ్రీలీల .. దుల్కర్ తో పాటు, సిద్ధూ జొన్నలగడ్డ మాట్లాడాడు. 

"ఈ కథను కల్యాణ్ శంకర్ నాకు చెప్పగానే .. దీనిని సినిమాగా చేస్తే బాగుంటుందని నాకు అనిపించింది. అలా ఈ సినిమా సితార వారి చేతికి వెళ్లింది. వాళ్లు ఖర్చును గురించి ఎంతమాత్రం ఆలోచన చేయరు. సినిమా మంచిగా వచ్చేవరకూ తీయమనే అంటూ ఉంటారు. అలాంటి నిర్మాతలు ఈ సినిమాకి దొరకడం అదృష్టం" అని అన్నాడు. 

"దర్శకుడు కల్యాణ్ శంకర్ మంచి రైటర్ కూడా .. 'టిల్లు స్క్వేర్' సినిమాకి నాతో పాటు కలిసి పనిచేశాడు. తన స్టైల్ ఎలా ఉంటుందనేది నాకు తెలుసు. మీరంతా ఆశించే ఎంటర్టైన్ మెంట్ ఉంటుంది. ఈ సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News