మా బావ ఎన్టీఆర్ సపోర్ట్ మరిచిపోలేను: 'మ్యాడ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నార్నె నితిన్
- యూత్ ఫుల్ స్టోరీగా రూపొందిన 'మ్యాడ్'
- హీరోగా నార్నె నితిన్ పరిచయం
- ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతో ఉందన్న హీరో
- ఈ నెల 6వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా
ఈ సినిమాతో ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ హీరోగా పరిచయమవుతున్నాడు. వేదికపై ఆయన మాట్లాడుతూ . "కల్యాణ్ శంకర్ ఏ రోజూ మమ్మల్ని టెన్షన్ పెట్టలేదు. నవ్వుతూ .. నవ్విస్తూ షూటింగు చేస్తూ వెళ్లారు. థియేటర్లో కూడా అలాగే మీ అందరినీ నవ్విస్తుందనే నమ్మకం ఉంది" అని అన్నాడు.
ఈ సినిమా మొదలైన దగ్గర నుంచి నాకు .. ఈ సినిమా టీమ్ కి కూడా మా బావ ఎన్టీఆర్ సపోర్ట్ ఎంతో ఉంది. ఆయన సపోర్టు తోనే ఈ రోజున మాకు ఇంతమంది బ్లెస్సింగ్స్ దొరుకుతున్నాయి. అందుకు బావకి నేను థ్యాంక్స్ చెబుతున్నాను. భీమ్స్ పాటలు ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తాయి" అని చెప్పాడు.