Indian Railways: మహిళా పోలీస్ స్టేషన్ సరే.. ఏపీలోని ‘మహిళా రైల్వే స్టేషన్’ గురించి ఎప్పుడైనా విన్నారా?

  • దేశంలో మొత్తం ఐదు స్టేషన్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించిన కేంద్రం
  • తొలి మహిళా రైల్వే స్టేషన్‌గా గాంధీ నగర్ రైల్వే స్టేషన్‌కు గుర్తింపు
  • ఏపీలోని చంద్రగిరి రైల్వే స్టేషన్ బాధ్యతలు కూడా మహిళా సిబ్బందే
Five railway stations in the country are entirely managed by women staff

మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. సమాజంలో వస్తున్న మార్పులకు తోడు ప్రభుత్వ విధానాలు కూడా ఇందుకు దోహదపడుతున్నాయి. మహిళలనే ప్రోత్సహించే దిశగా అనేక వినూత్న చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఐదు పోలీస్ స్టేషన్ల బాధ్యతలను పూర్తిగా మహిళలకే అప్పగించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం ఐదు మహిళా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అందులో ఒకటి ఏపీలో కూడా ఉండటం మరో విశేషం. 

చంద్రగిరి రైల్వే స్టేషన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉందీ రైల్వే స్టేషన్. ఇది గుంతకల్లు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ అందరూ మహిళలే ఉంటారు. అన్ని బాధ్యతలూ వారే చూసుకుంటారు. 

మాతుంగా రైల్వే స్టేషన్: 
ముంబైలోని మాతుంగా రైల్వే స్టేషన్‌లో కూడా అందరూ మహిళా ఉద్యోగులే. ఈ స్టేషన్ 2018లో లిమ్కా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. 

గాంధీనగర్ రైల్వేస్టేషన్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఉన్న ఈ స్టేషన్‌ దేశంలోనే తొలి మహిళ రైల్వేస్టేషన్‌గా గుర్తింపు పొందింది. 

మణినగర్ రైల్వేస్టేషన్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఈ స్టేషన్ ఉంది. స్టేషన్ మాస్టర్‌తో సహా మొత్తం 25 మంది ఉద్యోగులున్నారు. రైల్వే సెక్యూరిటీ ఫోర్స్‌కు చెందిన 10 మంది మహిళా సైనికులు ఇక్కడ భద్రతా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. 

More Telugu News