Nara Lokesh: ఎల్లుండి రాజమండ్రి జైల్లో చంద్రబాబును కలవనున్న లోకేశ్

Nara Lokesh to meet chandrababu in jail
  • రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్న నారా లోకేశ్
  • ఈ నెల 9న సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ
  • విచారణ జరిగే సమయానికి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న లోకేశ్!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎల్లుండి (శుక్రవారం) రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్న పార్టీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తండ్రి అరెస్టైన రెండు రోజులకు ఢిల్లీకి వెళ్లిన లోకేశ్ అక్కడ న్యాయవాదులు, పలువురు నేతలతో వరుసగా భేటీ అయ్యారు. రేపు ఢిల్లీ నుంచి విజయవాడకు రానున్నారు. ఎల్లుండి చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిగే సమయానికి తిరిగి ఢిల్లీకి వెళ్లాలని లోకేశ్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
Nara Lokesh
Chandrababu
New Delhi

More Telugu News