nobel prize: రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ బహుమతి

  • మౌంగి జీ బావెండి, లూయీస్ ఈ బ్రుస్, అలెక్సీ ఐ ఎకిమోవ్‌లకు నోబెల్
  • క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో వీరిది కీలక పాత్ర అన్న నోబెల్ కమిటీ
  • భవిష్యత్తులో జరగబోయే క్వాంటమ్ కమ్యూనికేషన్ కోసం క్వాంటమ్ డాట్స్ కీలకమని వెల్లడి
Nobel Prize in Chemistry honours innovators of quantum dots technology

ఈ ఏడాది ముగ్గురు రసాయన శాస్త్రవేత్తలను నోబెల్ బహుమతి వరించింది. బుధవారం రసాయన శాస్త్రంలో నోబెల్‌ను ప్రకటించారు. మౌంగి జీ బావెండి, లూయీస్ ఈ బ్రుస్, అలెక్సీ ఐ ఎకిమోవ్‌లకు 2023 ఏడాదికి గాను నోబెల్ బహుమతి దక్కినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రకటించింది. క్వాంటమ్ డాట్స్ విశ్లేషణ, ఆవిష్కరణలో వీరు కీలక పాత్ర పోషించినట్లు కమిటీ తెలిపింది.

క్వాంట‌మ్ డాట్స్‌, నానో పార్టిక‌ల్స్‌కు విశిష్ట‌మైన గుణాలు ఉన్నాయ‌ని, టీవీ స్క్రీన్స్, ఎల్ఈడీ బ‌ల్బుల్లో వెలుతురు వ్యాప్తికి ఆ పార్టిక‌ల్స్ కార‌ణ‌మ‌ని నోబెల్ క‌మిటీ తెలిపింది. ఆ పార్టిక‌ల్స్ వ‌ల్ల క‌లిగే ర‌సాయ‌న‌క చ‌ర్య‌లు, వాటి నుంచి ప్ర‌స‌రిస్తున్న వెలుతురు వ‌ల్ల వైద్యులు క‌ణ‌తుల‌కు ఈజీగా శ‌స్త్రచికిత్స చేస్తున్న‌ట్లు పేర్కొంది. క్వాంట‌మ్ డాట్స్ ద్వారా ప‌రిశోధ‌కులు క‌ల‌ర్డ్ లైట్‌ను సృష్టించిన‌ట్లు తెలిపారు. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే క్వాంట‌మ్ క‌మ్యూనికేష‌న్ కోసం క్వాంట‌మ్ డాట్స్ కీల‌కం కానున్న‌ట్లు నోబెల్ క‌మిటీ తెలిపింది.

More Telugu News