Sudheer Babu: ఈ ఫ్రైడే థియేటర్స్ కి వస్తున్న సినిమాలివే!

  • ఈ నెల 6వ తేదీన థియేటర్ల దగ్గర సందడి 
  • అరడజను సినిమాలకి పైగా విడుదల 
  • బరిలో  సుధీర్ బాబు .. కిరణ్ అబ్బవరం 
  • 'చిన్నా' సినిమాతో వస్తున్న సిద్ధార్థ్      
Movies that release on this Friday

ఈ శుక్రవారం .. అంటే 6వ తేదీన థియేటర్ల దిశగా ఎక్కువ సినిమాలే కదులుతున్నాయి. దాదాపు అరడజను సినిమాలు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాయి. సుధీర్ బాబు హీరోగా రూపొందిన 'మామా మశ్చీంద్ర' ఈ రోజునే విడుదల కానుంది. హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ఈషా రెబ్బా - మృణాళిని రవి నటించారు. ఇక కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన 'రూల్స్ రంజన్' కూడా ఇదే రోజున విడుదల కానుంది. రత్నం కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్ గా నేహా శెట్టి అలరించనుంది. నవీన్ చంద్ర - స్వాతి రెడ్డి జంటగా నటించిన 'మంత్ ఆఫ్ మధు' సినిమా కూడా ఈ రోజేనే ప్రేక్షకులను పలకరించనుంది. చదువు మీద పెద్దగా ధ్యాస లేని ముగ్గురు కుర్రాళ్ల కథగా 'మ్యాడ్' సినిమా రూపొందింది. ఇదే రోజున రిలీజ్ అవుతున్న ఈ సినిమాతో హీరోగా నార్నె నితిన్ పరిచయమవుతున్నాడు. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ గా రూపొందిన '800' .. సిద్ధార్థ్ సొంత బ్యానర్ లో నిర్మితమైన 'చిన్నా' కూడా ఇదే రోజున థియేటర్లలో దిగిపోనున్నాయి. వీటిలో ఏ సినిమా ఎక్కువ మార్కుల కొట్టేస్తుందో చూడాలి.

More Telugu News