దయచేసి ఆ ఒక్కటీ నన్ను అడగకండి: విరాట్ కోహ్లీ
- వన్డే ప్రపంచకప్ మ్యాచులు చూసేందుకు స్నేహితుల ఆసక్తి
- టికెట్లు ఇప్పించాలంటూ కోహ్లీకి ఫ్రెండ్స్ నుంచి డిమాండ్
- తనను టికెట్లు కోరొద్దంటూ, ఇంటి నుంచే చూడాలని సూచన
విరాట్ కోహ్లీకి మంచి పలుకుబడి ఉండడంతో, అతడి ద్వారా మ్యాచ్ టికెట్లు సంపాదిద్దామనే ఆలోచన కొందరిలో కనిపిస్తోంది. తమకు టికెట్లు ఇప్పించాలని కోరుతున్నట్టు తెలిసింది. టికెట్లు కావాలంటూ తన దగ్గరకు వచ్చే స్నేహితులకు విరాట్ కోహ్లీ ముఖ్య సూచన చేశాడు.
‘‘ప్రపంచకప్ సమీపిస్తోంది. నా స్నేహితులు అందరినీ వినయంగా కోరేదేమంటే.. టోర్నమెంట్ వ్యాప్తంగా టికెట్ల కోసం నన్ను అభ్యర్థించొద్దు. దయచేసి మీ ఇంటి నుంచే ఎంజాయ్ చేయండి’’ అని ఇన్ స్టా గ్రామ్ స్టోరీస్ లో కోహ్లీ పోస్ట్ పెట్టాడు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కు ఒక టికెట్ ధర రూ.56 లక్షలకు చేరిందంటే డిమాండ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రూ.18-22 లక్షల ధరలో చాలా టికెట్లు అందుబాటులో ఉన్నాయి.