Kishan Reddy: అధిష్ఠానం నుంచి అత్యవసర పిలుపు.. హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన కిషన్ రెడ్డి

  • కేంద్ర కేబినెట్ సమావేశాల్లో తెలంగాణ అంశాలకు ప్రాధాన్యత
  • అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణపై బీజేపీ ఫోకస్
  • అమిత్ షాతో ప్రత్యేకంగా సమావేశం కానున్న కిషన్ రెడ్డి
Kishan Reddy went to Delhi

హైకమాండ్ నుంచి అత్యవసర కాల్ రావడంతో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అంశాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. గిరిజన విశ్వవిద్యాలయం, పసుపు బోర్డు వంటి పలు కీలక అంశాలపై కేబినెట్ లో నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో కిషన్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు వచ్చిందని చెపుతున్నారు. మరోవైపు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కిషన్ రెడ్డి భేటీ కానున్నారు. అసెంబ్లీ ఎన్నికలపై వీరిద్దరూ లోతుగా చర్చలు జరపనున్నారు.  

ఇదిలావుంచితే, నిన్న ఇందూరు సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రధాని చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో వేడి పుట్టించాయి. కేసీఆర్ ఢిల్లీకి వచ్చి తనను కలిశారని, ఎన్టీయేలో చేరుతామని, కేటీఆర్ కు రాష్ట్రంలో పాలన పగ్గాలు అందించాలనుకుంటున్నానని, కేటీఆర్ ను ఆశీర్వదించాలని తనను కేసీఆర్ కోరారని మోదీ చెప్పారు. అయితే ఇది రాచరికం కాదని, బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోబోమని ఆరోజే కేసీఆర్ కు స్పష్టం చేశామని తెలిపారు. ఎన్టీయేలో బీఆర్ఎస్ చేరేందుకు తాను అంగీకరించలేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

More Telugu News